ఏదన్నా సినిమా ప్రారంభమవుతోందంటే చాలు, ముందుగా లీకులు షురూ అవుతున్నాయి. సాధారణంగా అయితే, ఫలానా రోజు ఫలానా సినిమా షూటింగ్.. అంటూ, ప్రెస్ నోట్లు విడుదలయ్యేవి.
ఇప్పుడేమో, ట్విట్టర్‌లో గాసిప్స్ రూపంలో ఆయా విషయాలు లీక్ అవుతున్నాయి. ఇవి గాసిప్పులేంటి.? బ్రేకింగ్ న్యూసులేంటి.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విషయం, సెలబ్రిటీల పెళ్ళిళ్ళకీ సోకింది. అక్కడికేదో పెళ్ళి కుదిర్చిన బ్రోకర్లం తామేనన్నట్లుగా కొందరు ట్విట్టర్ వేదికగా లీకులు ఇస్తున్నారు.
ఇదిలా వుంటే, నితిన్ కొత్త సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతోంది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా టైటిల్. ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ అనేదాన్ని భిన్నంగా ప్రయోగించారంతే.
దీనికి సంబంధించి.. అంటే, టైటిల్ విషయమై, మొదటి నుంచీ బోల్డన్ని లీకులు. ఇప్పుడేమో టీజర్‌కి సంబంధించి కూడా లీకులొస్తున్నాయి. టీజర్‌లో డైలాగులు లీక్ అయిపోయాయి. ఇంకెందుకు హడావిడి.. సినిమా కూడా లీక్ చేసెయ్యండంటూ నితిన్ అభిమానులు గుస్సా అవుతున్నారు.
చిత్ర యూనిట్ ఇదో కొత్త టైపు పబ్లిసిటీ.. అన్నట్టుగా లీకులు ఏమైనా కావాలనే ఇస్తోందా.? అన్నది నితిన్ అభిమానుల డౌటానుమానం.