సలార్ వచ్చాక అందరూ బాహుబలి సినిమాని మర్చిపోతారంటున్నారు.. కారణం అదే ..?

సినిమాల పరంగా డార్లింగ్ ప్రభాస్ గురించి ఎవరు మాట్లాడినా బాహుబలి సినిమా కి ముందు ఆ తర్వాత అనే చెప్పుకుంటారు. అంతక ముందు చేసిన సినిమాల కంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారాడు. రాజమౌళి కారణంగా టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ హీరోగా క్రేజ్ సంపాదించుకోవడమే కాదు మొత్తం సౌత్ అండ్ నార్త్ లో ఉన్న స్టార్ హీరోలకి రాని ఇమేజ్ ప్రభాస్ దక్కించుకున్నాడు. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ దాదాపు 5 ఏళ్ళు కేటాయిస్తే అందరూ కామెంట్ చేశారు.

కాని బాహుబలి వచ్చాక అందులో ప్రభాస్ ని చూసి అందరి నోళ్ళు ముతపడ్డాయి. అంతటి క్రేజ్ అండ్ పాపులారిటీ సాధించాడు ప్రభాస్ అంటే ఖచ్చితంగా జక్కన్న నే ప్రధానంగా చెప్పుకోవాల్సింది. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో కూడా బాహుబలి సినిమా ని మర్చిపొయేలా చేయలేకపోయింది. అంతేకాదు ఇప్పుడు కమిటయిన సినిమాలని కూడా బాహుబలి సినిమాతో పోల్చలేకపోతున్నారు. కాని సలార్.. తాజాగా ప్రకటించిన ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా బాహుబలి సినిమా ని మర్చిపోతారని అంటున్నారు.

రాధే శ్యామ్.. ఆదిపురుష్.. నాగ్ శ్విన్ సినిమా..ఇలా చేతిలో మూడు పాన్ ఇండియన్ సినిమాలు ఉండగానే…కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ” సలార్ ” అన్న పాన్ ఇండియా సినిమాని ప్రకటించాడు ప్రభాస్. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది గాని ఇంత సడన్ గా అనౌన్స్ చేస్తారని మాత్రం ఊహించలేదు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న సలార్ సినిమాని కెజీఎఫ్ నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.

ప్రభాస్‌ని అత్యంత ధైర్యవంతుడైన ప్రతినాయకుడిగా ఈ సినిమాలో చూడబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పటికే సలార్ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయడం అన్ని చిత్ర పరిశ్రమలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్‌ లో మెషిన్ గన్‌మీద చేయి వేసి ప్రభాస్ యమా వైలంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు ప్రభాస్. కాగా ఈ సినిమా షూటింగ్‌ను 2021 జనవరిలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.