నేను క్షేమంగానే ఉన్నా ఆ వార్తలను నమ్మకండి.. అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్?

ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించి సందడి చేశారు మమతా మోహన్ దాస్.ఈమె తెలుగులో పలువురు హీరోల సరసన నటించిన సందడి చేశారు. అయితే ఉన్నఫలంగా ఈమె ఇండస్ట్రీకి దూరం అయ్యారు.భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి తనని చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అవ్వడమే కాకుండా ప్రాణాలను కాపాడకోవడం కోసం క్యాన్సర్ తో పోరాటం చేశారు. ఇలా విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ క్యాన్సర్ ను జయించి ప్రాణాలను దక్కించుకున్నారు.

ఈ విధంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఈమె తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ విధంగా క్యాన్సర్ తో పోరాడి క్షేమంగా బయటపడినటువంటి మమత మోహన్ దాస్ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు.అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

ఈమె క్యాన్సర్ నుంచి బయటపడినప్పటికీ మరోసారి క్యాన్సర్ బారిన పడ్డారని దాంతో ఈమె అనారోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు మెసేజ్లు చేస్తున్నారని తాజాగా సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు.కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనని ఇంటర్వ్యూ చేశారని తను తిరిగి క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు సృష్టించారు అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని తిరిగి క్యాన్సర్ బారిన పడలేదని ఈమె తన గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు.