Chiranjeevi : సినిమా టికెట్ల పంచాయతీ కొత్త మలుపు తిరిగింది. మొదట్లో ఈ విషయం గురించి వచ్చినప్పుడు మెగా స్టార్ చిరంజీవి ఇలాంటి విషయాల కోసం నేను సినిమా ఇండస్ట్రీ పెద్ద మనిషిలా వ్యవహరించను. సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలపై స్పందించగలను కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలకు నేను పెద్దమనిషిని కాదల్చుకోలేదు అని వాఖ్యనిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఏపీ గవర్నమెంట్ తో చర్చలకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి హాజరయ్యారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. నేడు ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది.ఈ విషయంపై కొందరు సినీ ప్రముఖులు స్పందించారు. కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఇక నిర్మాత సి కళ్యాణ్ ఈ విషయమై స్పందిస్తూ వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రికి వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని, సినీ పరిశ్రమ వైజాగ్ కూడా ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఛాంబర్ మరోసారి సమావేశమై చర్చిస్తామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతామన్నారు. అంతేకాకుండా..
చిరంజీవి పెద్ద కాదన్నా ఆయనే మాకు పెద్ద అని, ఒక వేడుక ఏర్పాటు చేసి సీఎంలను సన్మానిస్తామని, ఇద్దరు ముఖ్యమంత్రులకు సన్మానం చేసేందుకు త్వరలోనే చిరంజీవిని కలుస్తామని ఆయన వెల్లడించారు. సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.