ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు … దేనికోసమంటే ?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారా అంటే ఔననే వార్తలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల రెండో తేదిన ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ముంబ‌యి ఓ ఫిల్మ్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అదే రోజు సాయంత్రం గం.4. గంటల స‌మ‌యంలో స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది.

దీనికి కారణంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహూర్తాలు గట్రా చూసుకుంటారు. పైకి ఇదేదో కనబడ్డ.. సినిమా అంటే కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి.. ముహూర్తాలు మిగతా విషయాలపై హీరోలకు, నిర్మాతలు, దర్శకులకు ఇలాంటి పట్టింపులు చాలానే ఉంటాయి.

మరోవైపు మూవీ మేకర్స్ .. ఈ సినిమా నిర్మాణ విషయంలో మరోసారి మంచి ముహూర్తం చూసుకొని తిరిగి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు సలార్ విషయంలో కూడా అదే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ప్రభాస్ కూడా ఇపుడు సినిమాల ముహూర్తలా విషయంలో జాగ్రత్త ఉండాలని పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు తెలుస్తోంది. వరుసగా ఇలాంటి ఘటనలు సంభవించడంతో ప్రభాస్ ఇంట్లో దీని కోసం ప్రత్యేకంగా శాంతి పూజలు చేయించినట్టు సమాచారం. కొంత మంది పండితులు సమక్షంలో ప్రత్యేకంగా దోష పరిహార పూజలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ కూడా స్వయంగా ఈ పూజలో పాల్గొన్నట్టు సమాచారం.