సోషల్ మీడియా వేదికగా ప్రేమ కథను బయటపెట్టిన డాక్టర్ బాబు.. మంజుల వీడియో వైరల్!

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం అతను నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఇతనికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక డాక్టర్ బాబు వ్యక్తిగత జీవితానికి వస్తే ఈయన నటించిన మొట్టమొదటి సీరియల్ చంద్రముఖి. ఈ సీరియల్స్ ద్వారా పరిచయమైన నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Nirupam | Telugu Rajyamఇక పలు సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి నిరుపమ్ మంజుల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన విషయాలను వారి ఛానెల్ ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమ గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే మా లవ్ స్టోరీ అనే వీడియోను విడుదల చేశారు.ఇందులో మంజుల మాట్లాడుతూ చంద్రముఖి సీరియల్ టైమింగ్ లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన సంవత్సరానికి మా ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకునేవాళ్ళం అని తెలిపారు.

షూటింగ్ సమయంలో మేము ఒకరితో ఒకరు మాట్లాడే వాళ్లము కాదని ఫోన్ నెంబర్లు తీసుకున్న తర్వాత ప్రతి చిన్న విషయం ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం అని తెలిపారు.ఇలా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుంటే ఇంట్లో వారికి అనుమానం వచ్చిందని అయితే ఈ విషయం తన చెల్లి కీర్తికి తన తల్లికి తెలుసని మంజుల తెలిపారు. ఇక ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పడం వల్ల నిరుపమ్ గురించి వాళ్లకు తెలుసు కనుక మా పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చెప్పారు.

ఈ విషయం గురించి నిరుపమ్ మాట్లాడుతూ మా ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత జాతకాలు కలిస్తేనే పెళ్లి చేస్తామని చెప్పారు. లక్కీగా మా జాతకాలు కలవడం మా పెళ్ళి జరగడం జరిగిపోయిందని ఈ సందర్భంగా వీళ్లు తెలిపారు. నవంబర్ 21వ తేదీ నిరుపమ్ తనకి ప్రపోజ్ చేశారు అని నేడు మా ప్రపోజల్ అంటూ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.ఇలా మా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వెడ్డింగ్ కార్డు తీసుకొని చంద్రముఖి సీరియల్ టీం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles