టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే “గుంటూరు కారం” కాగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఇపుడు భారీ హైప్ ఉంది కానీ మరో పక్క ఒకో నటులు టెక్నీషియన్స్ ని పక్కన పెడుతుండడం ఫ్యాన్స్ లో టెన్షన్ గా మారింది.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం కంటెంట్ విషయంలో అలాగే త్రివిక్రమ్ టేకింగ్ లో అయితే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారట. ఇప్పటివరకు ఉంచిన కంటెంట్ చాలా బాగుండగా దీనికి అయితే సినిమా రిలీజ్ అయ్యాక అదిరిపోతోంది అని అంటున్నారు.
కాగా ఇదిలా ఉండగా ఇక మహేష్ బాబు బర్త్ డే ఈ ఆగస్ట్ 9న కావడంతో ఈ రోజున మాత్రం భారీ ట్రీట్ ఇస్తున్నట్టుగా ఇదివరకే నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ స్పెషల్ డే కి ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈరోజున అయితే ఓ స్పెషల్ పోస్టర్ ని సహా సినిమా నున్నచీ మొదటి సాంగ్ ని కూడా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా రిలీజ్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పుడు సినీ వర్గాల్లో హింట్స్ కూడా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అంటూనే వినిపిస్తున్నాయి. మరి వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
