క్రేజీ : పవన్ ఫ్యాన్స్ కి ఆరోజున డబుల్ బ్లాస్ట్.!

గాడ్ ఆఫ్ మాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మాస్ కాప్ డ్రామా “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. అయితే దీనికి కూడా అన్ని రీమేక్ లు లానే మొదట అభిమానులు ససేమిరా అంటున్నారు కానీ ఫైనల్ గా మేకర్స్ మాత్రం ఏదోకటి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

ఇక అసలు ఈ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా “గబ్బర్ సింగ్” తర్వాత ఆ రేంజ్ సినిమాగా చేస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా 2012 లో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యిన మే 11న రిలీజ్ కాగా ఇదే డేట్ కి డబుల్ బ్లాస్ట్ పవన్ ఫ్యాన్స్ కి రానున్నట్టుగా తెలుస్తుంది.

మొదటగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ టీజర్ ని అయితే రిలీజ్ చేయనున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఇదే రోజున అయితే హరీష్ పవన్ ల సెన్సేషనల్ హిట్ “గబ్బర్ సింగ్” రీ రిలీజ్ కూడా ఉంటుంది అని అంటున్నారు.

దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ వస్తుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో గాని “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ ప్లే చేస్తే ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.