ఓ రేంజ్ స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి. దానిని నిలబెట్టుకోవాలంటే మరింత హార్డ్ వర్క్ చేయాలి. కాన్ని ఒక్కోసారి విధి వైపరిత్యం వలన అంతా తలకిందులు అవుతుంది. మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ గంగలో కొట్టుకుపోతాయి. అలాంటి సమయంలో ఎవరు మనకు అండగా నిలవకపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. కాని తన జీవితంలోకి భార్యలా వచ్చిన అమూల్య నాకు సపోర్టింగ్‌గా నిలబడకపోతే జీవితం ఎలా మారిఉండేదో కూడా ఊహించుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు జబర్ధస్త్ ఫేం దొరబాబు.
హైపర్ ఆది టీంలో ఉంటూ తన కామెడీతో నవ్విస్తున్న దొరబాబు ఓ సారి వ్యభిచారం కేసులో పోలీసులకి దొరికి పోయాడు. మార్చిలో ఆయన ఇంటిపై రైడింగ్ చేసి పట్టుకున్నారు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక దొరబాబు కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కాని తిరిగి మళ్ళీ హైపర్ ఆది స్కిట్‌లో పలు పాత్రలు పోషిస్తున్న దొరబాబు రీసెంట్ గా వింద్య, యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న నువ్వు రెడీ నేను రెడీ అనే షోకు హాజరయ్యాడు. ఆ నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ తెగ బాధపడ్డాడు.
దొరబాబు.. నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది. దొరబాబు వ్యభిచారం కేసులో దొరికినప్పుడు అమూల్య చాలా సపోర్ట్ చేసింది. తన భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతనిపై నాకు నమ్మకం ఉందని చెప్పి అందరి నోళ్ళు మూయించింది అమూల్య. అయితే ఆ రోజు నా భార్య నాకు అండగా నిలబడకపోతే ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండేవాడిని కానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు దొరబాబు. ఆ రోజు ఏం జరిగిందో నాకు ,నా భార్యకు తెలుసు. ఇంకెవరికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదు. నిజాలు చెప్పిన ఎవరు నమ్మడం లేదంటూ బాధపడ్డాడు దొరబాబు. అయితే హైపర్ ఆది ఇప్పటికీ ఆ సంఘటలని తన స్కిట్‌లో వాడుకుంటూ కామెడీ పండిస్తున్న సంగతి తెలిసిందే.