చంద్రబాబు పర్యటన..రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత !

చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నేడు టీడీపీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే, గత రాత్రి 11.30 గంటల సమయంలో అనుమతి నిరాకరిస్తూ చిత్తూరు పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ నేపథ్యంలో అంతమందితో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అలాగే, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.

అయితే , ఇప్పటికే చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంకి చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అరగంట నుంచి విమానాశ్రయంలోనే చంద్రబాబు ఉండిపోయారు. మరోవైపు తెదేపా శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.