ఈ ఫోటోలో కనిపిస్తూన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాత ద్వారా వారి విభిన్నమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు పెద్ద టాస్క్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు విచిత్రమైన ఫోటోషూట్ లు జరుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కోసారి అభిమానులు సైతం ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో గుర్తుపట్టండి అంటూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక నటి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈమె స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్రపడినప్పటికీ ప్రస్తుతం ఈమె గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా జుట్టు మొత్తం విరబోసుకొని ఉన్నటువంటి ఫోటో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు ఇక్కడున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

మరి ఈ ఫోటోలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా… అదేనండి మన లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా శృతిహాసన్ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.