Devotional Tips: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు. మనం రాత్రి పగలు కష్టపడుతూ పని చేసేది ఆ పిడికెడు అన్నం కోసమే. ఇలా ఎంతో కష్టపడి తయారుచేసిన అన్నం తినే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో వ్యవహారశైలిని పాటిస్తూ ఉంటారు. అయితే అన్నం తినే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. పొరపాటున కూడా భోజనం చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మరి భోజనం చేసే సమయంలో ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం…
మనకు భోజనం పెట్టిన వారిని ఎలాంటి పరిస్థితులలో కూడా దూషించకూడదు, అదేవిధంగా ఏడుస్తూ భోజనం చేయకూడదు. భోజనం చేసే సమయంలో శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నేలపై కూర్చొని భోజనం చేయాలి. అన్నం తినేటప్పుడు ఎంగిలి చేతితో ఇతర ఆహార పదార్థాలను పట్టించుకోకూడదు. ఎడమచేతితో మనం తినే కంచం పెట్టుకోకూడదు.
కొంతమంది అన్నం తినే సమయంలో గొడవ పడుతూ… తినే కంచం విసిరి కొడతారు. పొరపాటున కూడా ఇలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇక భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా పైకి లేవకూడదు. ఎప్పుడూ కూడా మనం భోజనం కోసం ఎదురు చూడాలి కానీ ప్లేట్ లో భోజనం పెట్టి, ఆ భోజనం మన కోసం ఎదురు చూడకూడదు. ఈ విధంగా భోజనం చేసేటప్పుడు ఇలాంటి నియమాలను పాటించడం ఎంతో మంచిది.