Bommarillu Movie: కొన్ని సినిమాలు తీస్తున్నపుడు ఆ సినిమా తీస్తున్న డైరెక్టర్‌కి గానీ, నటిస్తున్న నటీనటులకు గానీ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది లేదా ఎంత ఫ్లాప్ అవుతుందనేది అస్సలు తెలియదు. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించి, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రకు ఎన్ని మార్కులు వేసినా తక్కువేనేమో. తన అసాధారణ నటనతో వీక్షకులకు కంటతడి పెట్టించారు. హీరో సిద్దార్థ చేసిన సిద్ధు పాత్ర ఇప్పటికీ యూత్‌కి చాలా దగ్గరగా ఉంటుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 15ఏళ్లయినా బొమ్మరిల్లు సినిమా మాత్రం బోర్ కొట్టకుండా ఆకట్టుకుంటుందనడం అబద్దమేమీ కాదు. ఇక అల్లరి అమ్మాయిగా జెనీలియా క్యారెక్టర్ ఫ్యాబ్యులస్ అని అప్పట్లోనే ఆమెకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. మొత్తంగా ఆ సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరీ చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ముందు చెప్పుకున్నట్టు ఆ సినిమా చేస్తున్నపుడు డైరెక్టర్‌కి కూడా తెలియదు ఇంతటి భారీ హిట్ అవుతుందని. కానీ బాధకరమైన విషయమేమిటంటే ఇప్పటి వరకూ మళ్లీ అలాంటి హిట్‌ను అందుకోలేకపోయార్ భాస్కర్.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరో కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లతో కాకుండా సిద్దార్థతో చేశారట. అందులో ఒకరు నవదీప్. అప్పుడప్పుడే కెరీర్‌ను నిలదొక్కుకుంటున్న నవదీప్, వేరే సినిమాలు ముందే కమిట్ అవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది. కానీ సిద్దుకు బదులు బొమ్మరిల్లు సినిమాలో నవదీప్ చేసి ఉంటే మాత్రం అతని కెరీరే మారిపోయేదని పలువురు భావిస్తున్నారు. అంతే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కూడా ఈ సినిమాకు హీరోగా చేసేందుకు సంప్రదించారని, కానీ అంత సాఫ్ట్ కథ తనకు సరిపోదని రిజెక్ట్ చేశారని సమాచారం.