కీర్తి సురేష్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఏం చేశారో తెలుసా?

మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ఇండస్ట్రీకి మాత్రం కీర్తి సురేష్ హీరోయిన్ గా రామ్ హీరోగా నటించిన నేను శైలజ అనే క్లాసికల్ సినిమాతో పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అలనాటి నటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తెలుగు తమిళ, మలయాళ భాషల్లో కొంతకాలం అగ్ర కథానాయక కొనసాగిందని చెప్పొచ్చు. తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ తన మొదటి సినిమా డబ్బులను నిర్మాతలు కవర్లో పెట్టి ఇచ్చేవారని, ఎంత ఇచ్చారు చూడకుండానే తన తండ్రికి ఇచ్చేదాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ మొత్తం మా నాన్నగారికే ఇచ్చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కీర్తి సురేష్ అభిమానులు, నేటిజెన్లు ఆమెను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

కీర్తి సురేష్ తల్లి ప్రముఖ హీరోయిన్ మేనక, తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో కనిపించింది. ఇప్పటివరకు తెలుగులో ఎటువంటి సినిమాలు కమిట్ అయినట్లు కనిపించలేదు. తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో అవకాశం వచ్చిందని, త్వరలో బాలీవుడ్ తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయని సౌత్ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉందో హీరోయిన్ కీర్తి సురేష్ కే తెలియాలి మరి.