లైగర్ సినిమా ఫైల్యూర్ తర్వాత పూరీ జగన్నాథ్ ఏం చేస్తున్నాడో తెలుసా…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడుగా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్, దేవదాస్, ఇడియట్, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులనే ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఈ జాబితాలోకి చేరుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక జర్నలిస్టు పాత్రలో కనిపిస్తాడు. ఇలా సినిమాలో చిరంజీవి ఇంటర్వ్యూ చేసిన పూరి జగన్నాథ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చిరంజీవితో ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో దాదాపు గంటసేపు మాట్లాడుకున్న చిరు-పూరీ ఎన్నో గాడ్ ఫాదర్ సినిమా గురించి ఫాన్స్ తెలుసుకోవాలనుకున్న ప్రశ్నలను గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇక ఈ క్రమంలో పూరీ మీరు అనుకున్న రిజల్ట్‌ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని చిరంజీవి అడగ్గా.. పూరి జగన్నాథ్ స్పందిస్తూ… జీవితంలో యుద్ధాలు జరిగిన ప్రాణాలు పోయినా కూడా హీలింగ్ టైం చాలా తక్కువగా ఉండాలి. మరిచిపోయి వేరే పనిలో పడిపోవాలి. కొన్ని సందర్భాలలో మనం నమ్మిన వారి వల్ల మోసపోవచ్చు. టైగర్ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ సినిమా తీశాను. కానీ రిజల్ట్ మాత్రం ప్లాప్ వచ్చింది. సినిమా ప్లాప్ అయిన తర్వాత ఆదివారం జిమ్ కి వెళ్లి 10 స్కాట్స్ చేశాను. అంతే నా స్ట్రెస్‌ మొత్తం రిలీజ్‌ అయిపోయింది. ఇక ఇప్పుడు బాంబేలో కొత్త కథలు తయారుచేసేపనిలో ఉన్నాను” అంటూ పూరీ జగన్నాథ్‌ సమాధానం చెప్పాడు.