Ameer Khan: లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్, చైతూ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Ameer Khan: హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ నటించిన ‘ద ఫారెస్ట్ గంప్’ ఆధారంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా.కరీనా కపూర్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోని ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ నాగచైతన్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం అమీర్ ఖాన్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషకం తీసుకోగా నాగచైతన్య 6 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన నటించనున్న కరీనా కపూర్ ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇదివరకే అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన త్రీ ఇడియట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోని ఈ జోడి నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.త్రీ ఇడియట్ సినిమా ద్వారా అందరినీ మెప్పించిన అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేయనున్నారో తెలియాల్సి ఉంది.