12 వారాలకు యాంకర్ రవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. విన్నర్ కన్నా ఎక్కువే?

బిగ్ బాస్ 12వ వారంలో భాగంగా ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి కన్నా హౌస్ లో ఆడని కంటెస్టెంట్ లో చాలామంది ఉన్నారు. వారు ఎలిమినేట్ కాకుండా రవి ఎలా ఎలిమినేట్ అవుతారు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే 12వ వారంలో భాగంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన రవి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో 12 వారాలపాటు సందడి చేసిన రవి వారానికి ఏడు నుంచి ఎనిమిది లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకారం చూసుకుంటే రవి 12 వారాలకు సుమారు 90 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో టాప్ వన్ లో ఉంటూ విజేతగా నిలిచిన వారికి 50 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. కానీ రవి మాత్రం ఏకంగా ప్రైజ్ మనీ కన్నా ఎక్కువగా సంపాదించుకున్నారు.

ఇలా పన్నెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు 90 లక్షల రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం.ఇక హౌస్ లో తాను చేసిన ఎంటర్టైన్మెంట్ దృష్టిలో ఉంచుకొని ఇతని రెమ్యూనరేషన్ మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇకపోతే రవి ఇంత మొత్తంలో సంపాదించుకొన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం రవి ఎలిమినేట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్దేశపూర్వకంగానే బిగ్ బాస్ రవిని ఎలిమినేట్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు.