అలియా భట్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి అలియా భట్.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకున్నారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ విధంగా అన్ని భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ తన మొట్టమొదటి సినిమా కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో నటించారు.

ఈ సినిమాలో వరుణ్ ధావన్ సిద్ధార్థ మల్హోత్రా హీరోలు గా నటించారు.ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తన కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకుని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదేవిధంగా ఈ సినిమా కోసం ఆమె అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం తాను 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నానని అదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటూ ఈ సందర్భంగా అలియా భట్ పేర్కొన్నారు.

ఇకపోతే తాను తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఏం చేశారు అనే విషయం గురించి ఈమె మాట్లాడుతూ ఈమె తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొని తన తల్లి చేతిలో పెట్టానని తెలిపారు. ఇప్పటికీ తాను ఇలాంటి ఆర్థికపరమైన విషయాల గురించి తాను పట్టించుకోనని అవన్నీ తన తల్లి చూసుకుంటుందని ఈమె తెలిపారు. ఇకపోతే ఇప్పటికీ తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందనే విషయం తనకు తెలియదని ఈ సందర్భంగా ఆలియా భట్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.