టాలీవుడ్ హీరోలు కత్రినా కైఫ్ ను బ్యాన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి అలాగే బాలకృష్ణ సరసన మరో సినిమాలో నటించారు. ఇలా తెలుగులో కేవలం రెండు సినిమాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈమెను తెలుగు హీరోలు పూర్తిగా బ్యాన్ చేశారు.ఈ విధంగా కత్రినా కైఫ్ ను తెలుగు హీరోలందరూ బ్యాన్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. కత్రినా కైఫ్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి సినిమాలో నటించారు. ఈ సినిమా కోసమే అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని సమాచారం.

ఈ విధంగా అప్పట్లోనే కత్రినా కైఫ్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇలా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా ఈమె వల్ల హీరోలతో సరైన కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడంతో హీరోలు ఈమెను బ్యాన్ చేశారు. సాధారణంగా కత్రినా కైఫ్ చాలా హైట్ ఉంటారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలతో ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి అదే విధంగా డాన్సులు చేయడానికి ఎంతో ఇబ్బందికరంగా మారడం వల్లే దర్శక నిర్మాతలు అలాగే హీరోలు కూడా కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారట.

ఇలా కత్రినా కైఫ్ వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం వల్లే ఈమెను తెలుగు హీరోలు బ్యాన్ చేశారని సమాచారం. అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తీసుకోవాలంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా చెల్లించుకోవాల్సి వచ్చేది. ఇక షూటింగ్ సమయానికి సరైన సమయానికి రాకపోవడం, షూటింగ్ సమయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీ కత్రినా కైఫ్ ను దూరం పెట్టారని సమాచారం.