కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార సినిమా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ కన్నడ భాషలో విడుదల అయింది.ఇలా కన్నడ భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రాన్ని అన్ని భాషలలో కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా అన్ని భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని వందల కోట్ల కలెక్షన్లను రాబడుతుంది.

ఈ చిత్రాన్ని హోం భలే నిర్మాణ సంస్థ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు.అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇలాంటి అద్భుతమైన సినిమాని అందించిన హీరో రిషబ్ శెట్టి పై పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే వందల కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కోసం హీరో ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారా అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో నటించినందుకు గాను హీరో రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. ఇక రిషబ్ శెట్టికి జోడిగా కన్నడ నటి సంయుక్త గౌడ్ హీరోయిన్ గా నటించారు. ఈమె ఈ సినిమా కోసం 1.25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్లతో తక్కువ బడ్జెట్ తో కాంతార సినిమానీ తెరకెక్కించగా ఈ సినిమా మాత్రం వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.