కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ గురించి అందరికీ తెలిసిందే.ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి 300 రూపాయలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్ మొదట్లో సీరియల్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇలా ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
హీరోగా యశ్ పలు సినిమాలలో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని నటించే యశ్ కేజిఎఫ్ సినిమాకి ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.ఈ విధంగా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో నెలకు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇక ఈయన నెలకు ఎంత సంపాదిస్తున్నారనే విషయానికి వస్తే..
యశ్ కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నో పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా రెండు చేతులా సంపాదిస్తున్న యశ్ నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఇతనికి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.