రామాయ‌ణ్ సీరియల్ లో సీత ..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

వెండితెర సీతమ్మ అంటేనే అందరికీ అలనాటి తార అంజలీదేవి, గుర్తుకు వస్తారు అయితే దూరదర్శన్ చానల్ లో ప్రసారం అయిన రామాయ‌ణ్ సీరియల్ ద్వారా ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్న తార దీపిక చిఖ్లియా అప్పట్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా రామాయ‌ణ్ సీరియల్ లో సీతమ్మ పాత్రలో నటించిన ఈమె సాక్షాత్తు సీతగా అందరి ఆదరణ పొందింది. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ కితెలుగు ప్రేక్షకాభిమానులు కూడా ఉన్నారు అంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో అభిమానులను సంపాదించుకుందో అర్థమవుతుంది.

నిజానికి ‘రామాయ‌ణ్’ సీరియ‌ల్ కంటే ముందు ‘విక్ర‌మ్ ఔర్ బేతాళ్’ హిందీ సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దీపిక‌. ఆ సీరియల్ లో తన నటన చూసి ఎంతో ముచ్చట పడిన డైరెక్టర్ తనకు రామాయ‌ణ్ సీరియల్లో అవకాశం కల్పించారు. కేవలం సీరియల్ మాత్రమే కాకుండా  ‘సున్ మేరీ లైలా’తో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో బి గ్రేడ్, హర్రర్ చిత్రాలు ఎక్కువగా నటించిన దీపిక అనంతరం అద్భుతమైన సినిమాల్లో నటించారు.

ఇక తెలుగులో ఈమె బ్రహ్మర్షి విశ్వామిత్ర, యమపాశం సినిమాలో హీరోయిన్ గా నటించారు. త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, భోజ్‌పురి సినిమాల్లోనూ నటించిన ఈమె విపరీతమైన పాపులారిటీని దక్కించుకోవడంతో ఏకంగ బీజేపీ ఆమెను త‌మ పార్టీలోకి ఆహ్వానించి 1991 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బ‌రోడా నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చారు. ఇలా ఎన్నికలలో గెలిచిన ఈమె ఎంపీగా కొనసాగారు.ఇక పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో స్థిరపడిన ఈమె ఇద్దరు పిల్లలకు తల్లిగా మారారు దీంతో పూర్తిగా దూరమైన దీపిక తిరిగి
2019లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వ‌చ్చిన బాలీవుడ్ మూవీ ‘బాలా’లో హీరోయిన్ యామీ గౌత‌మ్ త‌ల్లిగా నటించారు.