హీరో వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ కథాంశం ఉన్న చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ. శోభన్ బాబు తర్వాత కుటుంబ కథా నేపథ్యం ఉన్న చిత్రాలను నటించిన హీరోగా వెంకటేష్ పేరు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అద్భుతమైన అవార్డులను అందుకున్న హీరోగా వెంకటేష్ మంచి పేరు పొందారు.
ఇకపోతే వెంకటేష్ తండ్రి రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగారు.ఈ క్రమంలోనే ఆయన వారసత్వాన్ని అందుకుని ఆయన హీరోగా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.నిజానికి హీరో వెంకటేష్ కు సినిమాల్లోకి రావాలని ఎంతమాత్రం ఆశక్తి లేదట.తను బిజినెస్ వైపు వెళ్లాలని అనుకుంటూ ఉండగా అనుకోని పరిస్థితులలో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని పలుసార్లు వెల్లడించారు. ఈ విధంగా ఈయన హీరో అయినప్పటికీ తన బిజినెస్ ను మాత్రం వదులుకోలేదు.
తన అన్నయ్య సురేష్ తో కలిసి ఎన్నో వ్యాపారాలు చేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లను కూడా చేస్తూ వెంకటేష్ భారీగా సంపాదించారు. ఇంద్ర భవనం లాంటి ఇల్లు వేల కోట్ల ఆస్తి వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదని చెప్పాలి.తాజాగా అందిన సమాచారం ప్రకారం కేవలం వెంకటేష్ సంపాదించిన ఆస్తులు సుమారు 2 వేలకు పైగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈయన తన తండ్రి నుంచి వాటాగా వచ్చిన ఆస్తులను కలుపుకుంటే సుమారు 5 వేల కోట్ల వరకు ఉంటాయని సమాచారం.