2022లో రెండు పాన్ ఇండియా రిలీజ్‌లా.. డార్టింగ్ ప్ర‌భాస్‌కి అంత సీనుందంటారా?

ఒకే ఏడాదిలో రెండు సినిమాలు మొద‌లెట్టి .. ఇంచుమించు ఒకేసారి రిలీజ్ చేయ‌డం అంటే  ఠ‌ఫ్ టాస్కే.. 2022లో రెండు పాన్ ఇండియా రిలీజ్‌లు డార్టింగ్ ప్ర‌భాస్‌కి  సాధ్య‌మా? అంత సీనుందంటారా?

do prabhas succeed in releasing 2 pan india movies by 2022
do prabhas succeed in releasing 2 pan india movies by 2022

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టిస్తుంటే అంద‌రిలో ఒక‌టే సందేహం. ముఖ్యంగా అభిమానుల డౌట్లు క్లియ‌ర్ చేయాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు. `రాధే శ్యామ్’ తర్వాత వ‌రుస‌గా రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన ప్ర‌భాస్ .. ఆ రెండిటినీ ఎప్ప‌టికి సిద్ధం చేయిస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్ర‌భాస్ 22..  ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆదిపురుష్’ రెండింటి కోసం ఒకేసారి ప్ర‌భాస్ ప‌ని చేయ‌నున్నారు. ఇవి రెండు సినిమాలు 2022 లో థియేటర్లలోకి వస్తాయని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇది నిజ‌మా? ఒకేసారి రెండు పాన్-ఇండియన్ సినిమాల రిలీజ్ లు సాధ్య‌మేనా?

రెండు సినిమాల్లో ఒకేసారి పని చేయగలిగే స‌త్తా ఉందా డార్లింగ్? అంటే అంత దూకుడు ఇన్నేళ్ల‌లో ఎప్పుడూ చూడ‌లేదు. రెండు సినిమాలకు వేరే వేరేగా మేకోవ‌ర్ అవసరం కావచ్చు. నాగ్ అశ్విన్ చిత్రంలో ఫ్యూచరిస్టిక్ హీరో కోసం శరీరాకృతి మార్చాల్సి ఉంటుంది. అలాగే ‘ఆదిపురుష్’ లోని లార్డ్ రామ్ పాత్ర కోసం రూపురేఖ‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి పాన్ ఇండియా సినిమాల రిలీజ్ తేదీలు లాక్ చేయ‌డం పెద్ద స‌వాల్ అనే చెప్పాలి