ఇన్సైడ్ టాక్ : “డీజే టిల్లు” మళ్ళీ ఆగిపోతున్నాడా?

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు అయితే క్రేజీ రైడ్ లాంటి థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం టిల్లు స్క్వేర్ కూడా ఒకటి. మరి గత ఏడాది వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా అయితే వస్తున్నా ఈ చిత్రంలో హీరోగా యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తుండగా..

ఈసారి తనతో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయితే రొమాన్స్ చేయనుంది. కాగా ఈ చిత్రం అయితే ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కి చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. అయితే నిజానికి ఈ సినిమా డేట్ ని ఆగష్టు కి ఫిక్స్ చేసారు దాని నుంచి సెప్టెంబర్ కి సినిమా పోస్ట్ పోన్ కాగా ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ రేస్ నుంచి ఈ చిత్రం తప్పుకుంటున్నట్టుగా ఇన్సైడ్ టాక్.

సెప్టెంబర్ లో కూడా ఇదే సినిమా సమయానికి పలు నోటెడ్ చిత్రాలు తెలుగు సహా తమిళ్ నుంచి ఉండగా ఈ చిత్రం ఈ పోటీ నుంచి అయితే టిల్లు స్క్వేర్ తప్పుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా దీనిపై మళ్ళీ క్లారిటీ వస్తుంది అని తెలుస్తుంది. అయితే ఈ కొత్త డేట్ ఈ అక్టోబర్ 6 కి షిఫ్ట్ అయ్యిందని కూడా మరో టాక్.

మరి టిల్లు మరోసారి ఆగిపోయాడో లేదో చూడాలి. ఇంకా ఈ చిత్రానికి “అద్భుతం” దర్శకుడు మాలిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే త్రివిక్రమ్ ప్రొడక్షన్ బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు కలిసి నిర్మాణం వహిస్తున్నారు.