అలనాటి అందాల నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రోజా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ క్రమంలో రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి 9 సంవత్సరాల పాటు జడ్జ్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
ఇక రోజా రాజకీయ జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే.. మొదట టిడిపి పార్టీలో ఉన్న రోజా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఆ సమయంలో నగరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రజలకు తన సేవలను అందించింది. ఇక 2019లో జరిగిన ఎన్నికలలో రెండవసారి కూడా నగరి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇక ఇటీవల మంత్రివర్గ పునరుద్దీకరణలో భాగంగా జగన్ క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. అయితే ఇలా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జబర్దస్త్ లో జడ్జ్ స్థానానికి స్వస్తి చెప్పి తన పూర్తి సమయాన్ని ప్రజల సేవకై కేటాయిస్తోంది.
జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులలో రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొంది ప్రతిపక్ష నాయకుల మీద స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ ఉంటుంది. రాజకీయాలతో బిజీగా ఉండే రోజా సాంప్రదాయాలకు కూడా ఎక్కువ విలువ ఇస్తుంది. తాజాగా అక్టోబర్ 24 వ తేదీ దీపావళి సందర్భంగా రోజా తన ఇంట్లో లక్ష్మీదేవి పూజని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా టపాసులు పేలుస్తూ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంది. రోజా దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి అంటే మహిళా విజయం అంటూ రాసుకుంది. ప్రస్తుతంఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.