పెళ్లయిన వాడితో విడాకులు, ఏడేళ్లు చిన్న వాడితో డేటింగ్.. ఒక జాతీయ నటి లైఫ్ స్టోరీ!

సినీ ఇండస్ట్రీలో సినిమాలతో కన్నా ఎక్కువగా పర్సనల్ లైఫ్ ల తోనే ఎస్టాబ్లిష్ అయిన స్టార్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు సాధించిన సక్సెస్ ద్వారా కాకుండా తమ పర్సనల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ద్వారా ఎక్కువ ఫేమస్ అవుతారు. అందులో బాలీవుడ్ నటి కంకణా సీన్ శర్మ ఒకరు. బాలీవుడ్ అంటేనే ఎఫైర్లకి రొమాన్స్ కి పెట్టింది పేరు అని అందరూ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్టే బాలీవుడ్ హీరో హీరోయిన్ల మధ్య రూమర్ చాలానే వినిపిస్తుంటాయి.

ఇప్పుడున్న చాలామంది హీరో హీరోయిన్లు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న వారే. అలాగే కొంకణ సేన్ శర్మ కూడా ఒకప్పుడు ఒకరిని ప్రేమించి తర్వాత మరొకరిని పెళ్లి చేసుకొని అతనికి కూడా విడాకులు ఇచ్చి ఇప్పుడు తనకంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ప్రముఖ నటి మరియు దర్శకురాలు అయినా అపర్ణాసేన్ కుమార్తె ఈ కొంకనసేన్ శర్మ. అనేక భాషల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ రెండు నేషనల్ అవార్డ్స్ ని సైతం గెలుచుకుంది.

ముఖ్యంగా ఆమెకి హిందీ, బెంగాలీ సినిమాల్లో మంచి ఆదరణ లభించింది. ఈమె నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలుగా కూడా తన సత్తా చూపించింది. ఈమె రణవీర్ షోరే తో ప్రేమాయణం సాగించి పెళ్లికి ముందు అతనితో డేటింగ్ కూడా చేసింది. అయితే అతని వల్లే ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని వార్తలు అప్పట్లో బాలీవుడ్ లో గట్టిగానే వినిపించాయి. 2010లో వీరిద్దరి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకే వీళ్ళు విడాకులు తీసుకున్నారు. కాగా వీరికి హరూన్ అనే కుమారుడు ఉన్నాడు.

వీరికి 2015లో విడిపోయినప్పటికీ అధికారికంగా విడాకులు మాత్రం 2021లో పూర్తయ్యాయి. విడివిడిగా ఉంటూనే ఈ జంట తమ కుమారుడి బాధ్యతలు పంచుకోవడం గమనార్హం. ఇకపోతే కొంకణ సేన్ శర్మ ఇప్పుడు తనకంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన ఆమోల్ పరాసర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి డాలీ కిట్టి ఔర్ ఓ చమతే సితారే చిత్రంలో కలిసి నటించారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం.