గాసిప్ : “సలార్” మేకర్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ గుస్సా??

ఇప్పుడు అసలు నో డౌట్ గా ఇండియన్ సినిమా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా “సలార్” అనే చెప్పాలి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

తెలుగు కన్నడ సహా హిందీ లో ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఉండడంతో అక్కడా మంచి బజ్ ఉంది. అయితే ఇలా ఈ అన్ని విషయాల్లో బానే ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చేస్తున్న తెలివి తక్కువ పనులతో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ బాగా సఫర్ అవుతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

లాస్ట్ మినిట్ వరకు సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోగా మళ్ళీ సడెన్ గా మెయిల్స్ పంపి డిసెంబర్ రిలీజ్ అంటూ బాంబు పేల్చారు. అయితే ఇంకో పక్క హిందీలో పెద్ద రిలీజ్ షారుఖ్ ఖాన్ నటించిన “డున్కి” కూడా డిసెంబర్ 22కి ఫిక్స్ అయ్యి ఉండగా ఆల్రెడీ రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ని కాదని హిందీ డిస్ట్రిబ్యూటర్లు సలార్ కి  థియేటర్స్ కేటాయించలేరు.

పైగా డున్కి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ తో థియేటర్స్ కూడా లాక్ చేసుకున్నారట. మరి ఈ సమయంలో సడెన్ గా సలార్ నిర్మాతలు చేస్తున్న పనులని డిస్ట్రిబ్యూటర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తుంది. ఒక ప్లానింగ్ లేదు ఏది లేకుండా ఇలా అనౌన్స్ చేస్తే అప్పటికే తాము ఇచ్చిన మాట ఏం కావాలని అంటున్నారట. మొత్తానికి సలార్ మేకర్స్ విషయంలో ప్రెజెంట్ ఈ మాట నడుస్తుంది.