బిగ్ బాస్ అంటేనే గొడవలు ఉండాలి బాస్. లేదంటే అది బిగ్ బాస్ ఎలా అవుతుంది. అదే ప్రేక్షకులకు మజా. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వివాదాలు, చిలిపి చేష్టలు ఇవన్నీ ఉంటేనే షో పండుతుంది.
ఆ పని చేయడంలో బిగ్ బాస్ సీజన్ 4 తొలి రోజే సక్సెస్ అయింది. బిగ్ బాస్ లో ఏవైనా గొడవలు మొదలవ్వాలంటే కనీసం ఒక వారమైనా వేచి చూడాలి అనుకుంటున్న ప్రేక్షకులకు తొలిరోజే గొడవలు వినోదాన్ని పంచాయి.
నిజానికి ఈ గొడవ సీక్రెట్ రూపంలో ఉన్న సయ్యద్ సొహైల్, అరియానా గ్లోరీ తో స్టార్ అయిందని చెప్పుకోవాలి. వాళ్లిద్దరి మధ్య కాదు.. వాళ్ల వల్ల గొడవ అని అర్థం. వాళ్లు సీక్రెట్ రూంలో ఉన్నారు కదా.. వాళ్లకు ఫుడ్డు కావాలంటే అక్కడున్న ఫోన్ తో బిగ్ బాస్ హౌస్ కు ఫోన్ చేసి తమకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట.
అలా.. సయ్యద్ వెంటనే బిగ్ బాస్ హౌస్ కు ఫోన్ చేస్తాడు. సుజాత ఆవేశపడి ఆ ఫోన్ ను ఎత్తుతుంది. వెంటనే సయ్యద్.. తమకు లంచ్, డిన్నర్ కు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ చెబుతాడు. సరే.. తయారు చేస్తాం అని చెప్పి సుజాత ఫోన్ పెట్టేస్తుంది.
అంతే.. ఆ తర్వాత అసలు వాళ్లు ఎవరు? ఎందుకు ఫోన్ చేశారు.. అనేది తెలుసుకోకుండా.. వాళ్లకు ఫుడ్ వండి ఎలా ఇస్తాం.. అంటూ ఇంటి సభ్యులు సుజాతను అడిగారు. కరాటే కళ్యాణి కూడా సుజాతపై బాగానే ఫైర్ అయింది. అలా ఓ చిన్న గొడవ జరిగింది వాళ్లిద్దరి మధ్య.
ఆ తర్వాత ఆ గొడవను ఎలిమినేషన్ ప్రక్రియలో మళ్లీ చూపించుకున్నారు ఇద్దరూ. అక్కే దెబ్బడిపోయింది. ఇద్దరూ కొట్టుకునేంత పనిచేశారు. సుజాత ముఖం అయితే మాడిపోయింది పాపం.
వీళ్లదే మొదటి గొడవ కాబట్టి.. బిగ్ బాస్ కూడా ఆ గొడవను హైలెట్ చేశాడు. వీళ్ల గొడవనే ఒక ప్రోమోగా కూడా వేశాడు బిగ్ బాస్.