అక్కడ మాత్రం “సలార్” కి ఊహించని విధంగా డిజాస్టర్ రెస్పాన్స్.. 

ఈ ఏడాదికి ఇక ఒక బిగ్గెస్ట్ ఎండింగ్ గా అయితే రాబోతున్న బ్లాస్టింగ్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “సలార్” రిలీజ్ అనే చెప్పాలి. అలాగే ఇండియా వైడ్ గా ఈ సినిమాకి చాలా అంచనాలు ఉన్నాయని అందరికీ అర్ధం అయ్యింది.

కానీ ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి చాలా మంది ఇండియా వైడ్ గా భారీ బుకింగ్స్ ఉంటాయి అని అనుకున్నారు అనుకున్నట్టుగానే తెలుగులో అదిరిపోయాయి అలాగే తమిళ్ కన్నడ మలయాళంలో కూడా నోటెడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. కానీ అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న హిందీ బుకింగ్స్ విషయానికి వస్తే సలార్ కి ఫ్యాన్స్ కి షాకింగ్ అని చెప్పొచ్చు.

స్టార్టింగ్ లో ఈ సినిమా నార్త్ మార్కెట్ లో దున్నేస్తుంది అనుకున్నారు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి రిలీజ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురు కావడం ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ ఆ బుకింగ్స్ కూడా అంత ఎగ్జైటింగ్ గా ఏమి లేవు. దీనితో సలార్ బుకింగ్స్ మాత్రం అక్కడ అసలు ఊహించని విధంగా ఉన్నాయని చెప్పాలి.

దీనితో ఈ చిత్రం అసలు అనుకున్న రేంజ్ లో సగమైనా వసూళ్లు హిందీలో రాబడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సలార్ అంతా కూడా మాస్ వల్ల లాగేస్తుంది అని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా సలార్ హిందీ బుకింగ్స్ కనిపిస్తుండడం ట్రేడ్ వర్గాలకి కూడా ఒకింత షాకింగ్ గా ఉందని చెప్పక తప్పదు.