ఇండస్ట్రీ టాక్ : పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..!

ఇక ఈ డిసెంబర్ నెల కూడా పూర్తి కావచ్చింది. దీనితో ఈ ఇయర్ ఎండింగ్ మాత్రం సినిమా పరంగా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దే అని చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా ఈ డిసెంబర్ 31 కి గాను తన ఎవర్ గ్రీన్ హిట్ సినిమా “ఖుషి” రీ రిలీజ్ కాబోతుంది.

దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉండగా ఈ సినిమాతో పాటుగా అదే రోజు అయితే పవన్ ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” చిత్రం కూడా ఒకటి మరి ఈ సినిమాని కూడా ఇదే ఖుషి నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

మరి పనిలో పనిగా ఖుషి తో వీరమల్లు కొత్త గ్లింప్స్ యాడ్ చేస్తున్నట్టుగా వార్తలు కన్ఫర్మ్ కాగా ఇక నెక్స్ట్ ఈ అప్డేట్ తో ఆరోజు పవన్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు అని అర్ధం అయ్యిపోయింది. కానీ ఇపుడు పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్ ఏమిటంటే..

సినిమా మేకర్స్ ఖుషి సినిమాతో ఎలాంటి కొత్త గ్లింప్స్ ని యాడ్ చేయట్లేదట. దీనితో పవన్ ఫ్యాన్స్ కి ఆరోజు ఎలాంటి కొత్త ట్రీట్ లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అయితే పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.