షూటింగ్ సమయంలో సమంత చేసిన పనికి షాక్ అయిన దర్శకులు?

ఏమాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఆ తర్వాత తమిళ్, కన్నడ భాషలలో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని అతి తక్కువ కాలంలోనే సాత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే హీరో నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే కొంతకాలానికి నాగచైతన్య కి విడాకులు ఇచ్చి దూరమైంది. ఇలా తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి ఎక్కువ సమయాన్ని సినిమాలకు కేటాయిస్తూ వచ్చింది.

ఇక ప్రస్తుతం సమంత తెలుగుతోపాటు హిందీ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇక తెలుగులో సమంత నటించిన యశోద సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా దర్శకులు హరి హరీష్ లు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో సమంత గురించి మాట్లాడుతూ సమంత చాలా డెడికేటెడ్ పర్సన్. ఎమోషనల్ సీన్ చేయటానికి కేవలం రెండు నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుంది. ఎంత కష్టతరమైన సన్నివేశం అయినా సింగిల్ టేక్ లో గ్లిజరిన్ లేకుండానే చాలా ఎమోషనల్ గా నటిస్తుంది అంటూ వెల్లడించారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో సమంత వాళ్ళ సినిమా షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దర్శకులు సమాధానం చెబుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో సమంత అనారోగ్య విషయం తెలిసిందని వెల్లడించారు. సమంత వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఈ సినిమా లో ఒక స్టంట్ సీన్ చాలా అద్భుతంగా చేశారు. ఎంతలా అంటే.. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం వచ్చింది. సమంతకు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ చూసి షాక్ అయ్యాము. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని సమంత కోరుకుంటారు .. అంటూ సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.