నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా వై.వి.ఎస్. చౌదరి కొత్త సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ’న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వీణారావు అనే తెలుగు అమ్మాయిని పరిచయం చేయనున్నారు. కీరవాణి దీనికి సంగీతం అందించనున్నారు. ఆ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకునేందుకు వై.వి.ఎస్. చౌదరి విూడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఆ వివరాలివీ.. ‘న్యూ టాలెంట్ రోర్స్’ ఏర్పాటు చేసిన మూడో విూడియా సమావేశమిది. మొదటి విూటింగ్‌లో హరికృష్ణ మనవడిని పరిచయం చేయనున్నట్లు ప్రకటించాం. రెండో సమావేశంలో సంగీత దర్శకులు, రచయితల గురించి వెల్లడిరచాం. మూడో దాంట్లో ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడిరచాలని నిర్ణయించుకున్నాం.
నాకు అక్కినేని నాగార్జున గారు గాడ్ ఫాదర్‌తో సమానం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడోసారి విూడియా సమావేశంతో విూ ముందుకు వచ్చాం. హరికృష్ణ గారు నాకు సోదరుడితో సమానం. వీళ్లిద్దరితో ’సీతారామరాజు’ తీశాను. ఆ సినిమా తీయడం నా అదృష్టం. తెలుగంటే హరికృష్ణ గారికి ఎంతో గౌరవం. తెలుగు భాష దినోత్సవం రోజునే ఆయన మనల్ని వదిలివెళ్లడం బాధాకరం.
ఆయన ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. ఆయన రుణం తీర్చుకోలేను. ప్రత్యేకించి నాకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. ఇక ఈ సినిమా 1980 నేపథ్యంలో రానుంది. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నాం. తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. దానికి సరైన కథ ఇప్పుడు దొరికింది. ఈ సినిమాకు నేపథ్యమే బలం‘ అని వై.వి.ఎస్. చౌదరి చెప్పారు.