హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల నటించిన సినిమా థాంక్యూ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్యాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ రాశి ఖన్నా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా థాంక్యూ సినిమా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ క్రమంలో ‘థాంక్యూ’ సినిమా డైరక్టర్ విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ.. మన జీవితంలో ప్రతిరోజు థాంక్యూ అనే పదాన్ని ఎన్నోసార్లు పలుకుతుంటాము. థాంక్యూ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత ఎవరికీ తెలియదు. నిజానికి ‘థాంక్యూ’ అనేది చాలా పవర్‌ఫుల్ పదం, మనం ఆ పదానికి విలువ లేకుండా చేశాం అంటూ చెప్పుకొచ్చారు. నేను, నాగచైతన్య ఈ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మన జీవితంలో కచ్చితంగా కొందరికి థాంక్స్ చెప్పాలని భావించాం. మా ఇద్దరిలోనూ ఆ ఫీలింగ్ కలిగింది. అందువల్ల కొందరికి థాంక్స్ చెప్పిన తర్వత మేము ఈ సినిమా మొదలు పెట్టాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. టీనేజి పిల్లాడిలా, కాలేజీ కుర్రాడిలా ఆ తర్వాత 35-40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య 40-50 రోజుల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైతన్యకే దక్కుతుంది. ఈ సినిమాని ప్రేమమ్, ఆటోగ్రాఫ్ లాంటి గొప్ప సినిమాలతో పోల్చవచ్చు. అలా చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. కానీ ఈ సినిమా కి ఆ సినిమాలతో ఎటువంటి పోలిక ఉండదు. ఈ కథ విన్న వెంటనే కథలోని మెయిన్ సోల్ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడిగా నేను కథకు కనెక్ట్ కాలేనప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయటం వేస్ట్ అంటూ చెప్పుకొచాడు. ఈ సినిమాలో ఒక మ్యాజిక్ ఉంటుంది..అది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అంటూ వివరించాడు.