Pawan Kalyan: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో అని అన్నారు. సోషల్ విూడియా వేదికగా అభిమానులు, నెటిజన్లతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే ఆయన తాజాగా పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Pawan Kalyan: సెప్టెంబర్ 23 నుంచి ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
‘కృష్ణవంశీగారు విూ సినిమాలంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా విూ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం‘ అని ఎక్స్‌లో నెటిజన్ అడగగా దానికి ఆయన సమాధానమిచ్చారు. ‘మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. నిజం ఎప్పటికైనా నిజమే. దాన్ని నిరూపించడానికి ఎవరి అంగీకారం అవసరం లేదు. పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో. ఇది మరోసారి రుజువైంది. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఇంకా ఎంతోమంది రావాలి. యోగి ఆదిత్యానాథ్ తర్వాత అలాంటి విలువలు, తెలివితేటలు ఉన్న ప్రత్యేక రాజకీయవేత్త పవన్. దేవుడు ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు’ అని సమాధానమిచ్చారు.
Pawan Kalyan: సభ్య సమాజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశమేంటి.?
ప్రస్తుతం ఆంధ్రాలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మరో నెటిజెన్ ‘అన్నం’ సినిమా అప్డేట్ ఇవ్వండి, అది పరమాన్నం అయినా, గంజి అన్నం అయినా పర్లేదు.. పర్లేదు. కానీ ఆ సినిమా మాత్రం కావాలి అనడిగారు. ఆ సినిమాకు నిర్మాత, డబ్బు కావాలి, ప్రస్తుత సమయంలో బిజినెస్ డైనమిక్ కష్టతరంగా మారాయి. కానీ ఆ సినిమా తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.