వావ్ : అల్లు అర్జున్, క్రిష్ నుంచి షాకింగ్ సర్ప్రైజ్…

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్నటువంటి హీరోస్ లో టాలీవుడ్ హీరోల్లో తన సొంత క్రేజ్ తో వచ్చిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే ఉంటాడు. కాగా ఇప్పుడు బన్నీ భారీ చిత్రం “పుష్ప 2” లో బిజీగా ఉండగా అల్లు అర్జున్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లైనప్ తో సిద్ధం అవుతున్నాడు.

తెలుగు దర్శకుడు తమిళ్ సహా హిందీలో కూడా భారీ సినిమాలు వింటున్న అల్లు అర్జున్ నుంచి షాకింగ్ సర్ప్రైజ్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో డైరెక్ట్ హిందీ సబ్జెక్టు ఒకటి అల్లు అర్జున్ ఇప్పుడు సిద్ధం చేయడం షాకింగ్ గా మారింది. “కబీ అప్నే కబీ సప్నే” అనే ఓ టైటిల్ కూడా ఈ ఇద్దరి ప్రాజెక్ట్ పై వైరల్ గా మారగా ఈ ఇద్దరి కాంబినేషన్ పై వచ్చిన ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.

కాగా ఈ వీడియో ఫుల్ హిందీలోనే హిందీ నటులతోనే కనిపిస్తుండగా అల్లు అర్జున్ క్రిష్ కాంబినేషన్ నుంచి ఫస్ట్ హిందీ సినిమా పడుతుందా అనే టాక్ మొదలైంది. ఇప్పటికీ వీరి కాంబినేషన్ లో వచ్చిన “వేదం” మంచి క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

మళ్ళీ ఈ సినిమా తర్వాత అయితే అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇది సినిమా కోసమా లేక ఏదన్నా యాడ్ షూట్ మాత్రమేనా అనేది అనుమానంగా ఉంది. లేటెస్ట్ ఫుటేజ్ లో యాడ్ లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే రానున్న రోజుల్లో క్లారిటీ రానుందట.