పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఫిక్స్ ..!

పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ కాంబినేషన్ లో తీన్ మార్.. గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో తీన్ మార్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ గా నిలవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. కాగా వకీల్ సాబ్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా వరసగా సినిమా చేసేందుకు ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో 6 ప్రాజెక్ట్ లున్నాయి.

వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. శృతి హాసన్ గెట్ రోల్ లో నివేదా థామస్.. అంజలి.. అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండగా విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుం కోష్యియం కూడా త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది.

యంగ్ డైరెక్టర్ సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ 26 నుంచి సెట్ కు వస్తారట. చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేస్తారట. తిరిగి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి మొదలనుందట. ఈ లోపు పవన్ ఇంటిసెట్, పోలీస్ స్టేషన్ సెట్, రానా ఇంటి సెట్, లాడ్జి సెట్ లు రెడీ చేస్తారని సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ తో పాటు స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందిస్తున్నాడు. మరొక వైపు హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి సినిమాలకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాగా పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ కి యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ ని ఫైనల్ చేసినట్టు లేటేస్ట్ అప్‌డేట్. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజ తో ఖిలాడి సినిమా చేస్తున్నాడు.