గాడ్ ఫాదర్ సినిమా నచ్చలేదన్న డైరెక్టర్ అనుదీప్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన హిట్ అందుకొని మంచి కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే జాతి రత్నాలు సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనుదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే యాంకర్ గాడ్ ఫాదర్ సినిమా చూశారా అంటూ ప్రశ్నించగా అందరూ తనని ఇదే ప్రశ్న అడుగుతుంటే సినిమా చూశానని ఈయన సమాధానం చెప్పారు.

ఈ సినిమా చూసిన తర్వాత తనకు సినిమా చాలా బోరింగ్ అనిపించిందని సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదంటూ ఈయన కామెంట్స్ చేశారు.ఇలా ఈయన కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన యాంకర్ అసలు మీరు ఏ గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అంటూ ప్రశ్నించారు.ఈ క్రమంలోనే అనుదీప్ మాట్లాడుతూ తాను హిందీ గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నానని నాకు ఆ సినిమా ఏ మాత్రం నచ్చలేదంటూ ఈయన చెప్పినటువంటి సమాధానం అందరిని ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఈయన చిరంజీవి సినిమా గురించి చెప్పి చివరిలో మాట మార్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు.