టాలీవుడ్ లో బడా నిర్మాత దిల్ రాజు తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కొనసాగుతున్నారు. ఏడాదికి అరడజను సినిమాలకు పైగా ఆయన తన ప్రొడక్షన్ హౌస్ నుంచి నిర్మిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ఉన్నారు.
దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి దర్శకుడిగా పరిచయం కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో దిల్ రాజు కేంద్రంగా చాలా రాజకీయం నడుస్తూ ఉంటుంది. కొంతమంది చిన్న నిర్మాతలు అతనిని రెగ్యులర్ గా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు.
అయితే ఇండస్ట్రీలో ఉన్న చాలా సమస్యలను దిల్ రాజు తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు. గత ఏడాది ఏపీలో టికెట్ల ఇష్యూ వచ్చినప్పుడు దిల్ రాజ్ కూడా అడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మాతలకు సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రెస్ మీట్ లో దిల్ రాజును మీడియా ప్రతినిధులు రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగారు.
గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ నుంచి దిల్ రాజుకి ఆహ్వానం అందుతుందనే ప్రచారం నడుస్తుంది. అలాగే అతను మాత్రం పవన్ కళ్యాణ్ తో ఉన్న సాహిత్యం కొద్ది కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజుని రాజకీయాల గురించి విలేకరులు అడిగారు.
అయితే ఇండస్ట్రీలో రాళ్ల దెబ్బలను తట్టుకోవడం కష్టంగా ఉందని, రాజకీయాలకు వెళ్తే ఇంతకంటే ఎక్కువ రాళ్లు విసురుతారని, వాటిని తట్టుకోవడం తన వల్ల కాదని దిల్ రాజు తేల్చేశారు. దీంతో దిల్ రాజు రాజకీయాల్లోకి వెళ్తారు అంటూ వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది. బలగం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఆస్వాదిస్తున్న దిల్ రాజుకి ఇలా రాజకీయపరమైన ప్రశ్నలు ఎదుర్కోవడం విశేషం.