ఫైనల్ గా “గేమ్ చేంజర్” రిలీజ్ పై ఓపెన్ అయ్యిన దిల్ రాజు 

రానున్న రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోస్ నుంచి పలు క్రేజీ ప్రాజెక్ట్ లు రానున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో ఓ క్రేజీ కాంబినేషన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ పొలిటికల్ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రమే “గేమ్ చేంజర్”.

మరి ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పైగా ఇండియా టాప్ దర్శకులు శంకర్ రాజమౌళితో వర్క్ చేసిన ఏకైక హీరోగా కూడా దీనితో రామ్ చరణ్ నిలవడంతో ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ గా మారింది.

ఇంతేకాకుండా రామ్ చరణ్ శంకర్ కెరీర్ లో కూడా ఇది 15వ సినిమా కావడం దిల్ రాజు బ్యానర్ లో ఇది 50 వ సినిమాగా అనౌన్స్ చేయడంతో అందరికీ కూడా ఒక బెంచ్ మార్క్ సినిమాగా ఇది నిలవగా అప్డేట్స్ కానీ రిలీజ్ ప్లానింగ్ లో కానీ మేకర్స్ ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నారు.

అయితే ఫైనల్ గా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రిలీజ్ పై ఎట్టకేలకు నిర్మాత దిల్ రాజు ఓపెన్ అవ్వడం వైరల్ గా మారింది. దిల్ రాజు రీసెంట్ మీడియా ముందు మాట్లాడుతూ సినిమా ప్రస్తుతం 80 శాతానికి పైగా కంప్లీట్ అయ్యింది అని అలాగే దర్శకుడు శంకర్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు.

అందుకే కాస్త ఆలస్యం అవుతుంది అని తాను తెలిపారు. అయితే ఒక్కసారి షూటింగ్ పూర్తయిపోతే అప్పుడు ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తామని ఓ క్లారిటీ అందించాడు. దీనితో గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ అవ్వడం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ అంజలి లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.