టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులో ఉన్న అతని ఇంటి వద్ద నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు, మీడియా ద్వారా పెద్ద చర్చకు కారణమయ్యాయి. దాదాపు 48 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతుండటంతో టాలీవుడ్‌లో కలకలం రేపాయి.
దిల్ రాజు బాల్కనీలో కనిపించిన సమయంలో మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ, ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగడంలేదు, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయి. ఐటీ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే మీడియా తనపై ప్రత్యేక దృష్టి పెట్టడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి, కానీ అంతటా ఒకే విధంగా కాకుండా నా గురించే ఎక్కువగా ప్రచారం జరగడం విచారకరం అని అన్నారు.
IT Raids: టాలీవుడ్‌లో ఐటీ దాడులు: అసలు రీజన్ ఇదేనా?
ఇదే సమయంలో, ఐటీ అధికారులు మరికొందరు నిర్మాతలపై కూడా దాడులు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ దాడులు ప్రత్యేకంగా పెద్ద నిర్మాతలపై మాత్రమే కాకుండా, పలు మీడియా సంస్థలపై కూడా జరుగుతున్నాయి. ఈ ఘటన టాలీవుడ్‌తో పాటు, ఫిల్మ్ ఫైనాన్స్ రంగంలోనూ చర్చకు దారి తీస్తోంది. ఐటీ అధికారుల సోదాలు ఇప్పట్లో ముగియే సూచనలు కనిపించడంలేదు. దీనితో టాలీవుడ్ వర్గాలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, పరిశ్రమలో ఈ దాడుల పట్ల వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.