కృష్ణంరాజు ఒడిలో ఉన్న ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోటోలో కృష్ణంరాజు ఎత్తుకున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందటమే కాకుండా తమిళ్ , కన్నడ, మలయాళ సినిమాలలో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.చిన్నతనంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అవటమే కాకుండా పెరిగి పెద్దయ్యాక హీరోయిన్గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

కృష్ణంరాజు ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు హీరోయిన్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా హీరోయిన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. హీరోయిన్గా కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కూతురు పుట్టిన కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రలో నటించింది.

ఇక ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించాడు. భర్త మరణంతో కృంగిపోయిన మీనా… కొంతకాలం ఇంటికి పరిమితం అయింది. అయితే భర్త మరణించిన బాధని మరచిపోవడానికి షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా మారిపోయింది. షూటింగ్ పనులతో బిజీగా ఉంటు ఇప్పుడిప్పుడే తన భర్త మరణించిన బాధనుండి మీనా బయట పడుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మీనా కృష్ణంరాజుతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు మరణించిన సమయంలో ఆయనకు నివాళులు అర్పించడానికి చిన్నప్పుడు ఆయనతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .