ప్రధాని నేషనల్ ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త?

రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రధాన్ మంత్రి నేషనల్ ల్యాప్‌టాప్ స్కీమ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంటర్ చదివే విద్యార్థుల నుండి గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థుల వరకు కేంద్ర ప్రభుత్వం ఉచిత లాప్టాప్ పొందవచ్చునని ఈ స్కీమ్ లో ఉంటుంది. ఇలా విద్యార్థులకు ఈ పథకం పేరుతో వచ్చే వాట్సాప్ మెసేజ్ లు పంపి కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకాలు అమలులోకి తీసుకురాలేదని ఇటీవల నిరూపణ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్కీం పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈ పథకంలో ఎటువంటి నిజం లేదని.. పీఎంఎస్ఎస్‌గౌ.ఆన్‌లైన్ అనేది నకిలీ వెబ్‌సైట్ అని నిరూపణ అయ్యింది. ఈ స్కీం ద్వారా ఉచితంగానే ల్యాప్‌టాప్స్ పొందొచ్చనే మెసేజ్ వస్తే విద్యార్థులు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఫేక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల విద్యార్థులు తమ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది.

అందువల్ల పీఎంఎస్ఎస్‌గౌ.ఆన్‌లైన్ పేరుతో వచ్చిన మెసేజ్లు ఇతర విద్యార్థులకు ఫార్వర్డ్ చేయకుండా వెంటనే వాటిని డిలీట్ చేయాలని పొరపాటున కూడా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ స్కీం లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అందువల్ల విద్యార్థులు ఇటువంటి ఫేక్ స్కీమ్స్ ని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.