బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చేయడం.. రెమ్యునరేషన్ కూడా కోటి దాటేసి, ఇంకా ఇంకా పెరిగిపోవడంతో.. మనోడికి కళ్ళు నెత్తికెక్కాయ్.! ఓ యంగ్ హీరో గురించి, అతని మీటర్ గురించీ మేటరు చాలానే నడిచింది తెలుగు సినీ పరిశ్రమలో.
తీరా సినిమా ఫట్ అయ్యేసరికి.. సదరు యువ హీరోగారికి కళ్ళు నెత్తి మీద నుంచి కిందికి దిగాయట.! ఇకపై ఏ సినిమా విషయంలోనూ అస్సలు కెలకను.. అని ఆయా చిత్రాల నిర్మాతలకి చెబుతున్నాడట.
అదే సమయంలో, హీరో మార్కెట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని కొందరు నిర్మాతలకూ తత్వం బోధపడిందట. రెమ్యునరేషన్ కూడా సగానికి తగ్గించేశారట ఆ హీరోగారికి.
అయినా, బాగానే గిట్టబాటువుతుందనుకోండి. అది వేరే సంగతి. హీరోయిన్ల విషయంలోనే, ‘ఫలానా హీరోయిన్ కావాలి’ అనే మంకు పట్టు మాత్రం ఆ హీరో వీడటంలేదట.!