ఎన్టీయార్ ఎందుకు డుమ్మా కొట్టాడబ్బా.?

ఎన్టీయార్‌కి అసలేమైంది. ‘మై బ్రదర్..’. అంటూ రామ్ చరణ్ ఆప్యాయంగా పిలుస్తున్నా… ఎన్టీయార్ ఎందుకో దూరం దూరం వుంటున్నాడు. ఎంతో స్నేహంగా అన్నదమ్ముల్లా వుండే ఎన్టయార్, రామ్ చరణ్ మధ్య ఏం జరిగింది.? అసలు ఎన్టీయార్ ఎందుకిలా మారిపోయాడు.?

ఒకవేళ మెగా కాంపౌండ్‌తో కలవొద్దని బాలయ్య హెచ్చరించాడా.? ఉపాసన – లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహం వుండేది. కానీ, ఆ ఇద్దరూ కూడా ఈ మధ్య కలిసినట్లు కనిపించలేదు.

ఎన్టీయార్ – రామ్ చరణ్ మధ్య ఏం జరుగుతోంది.? తారలంతా హాజరైన రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీయార్ ఎందుకు దూరమయ్యాడు.? ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎన్టీయార్‌కి రామ్ చరణ్ తర్వాతే ఇంకేదైనా అన్నట్లుగా వుండాలి.

అలాంటిది ఎన్టీయార్ తీరు అందర్నీ అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు ఈ సందర్భంగా,. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి చిరంజీవి ఘనంగా సన్మానం కూడా చేశారు. అది కూడా ఎన్టీయార్ మిస్సవ్వడం శోచనీయం.. .