సౌందర్య ఆ నిర్ణయం తన తల్లిదండ్రులకు శోకంగా మారిందా.?

సౌందర్య ఈ పేరు చెబితేనే ఆమె రూపం కళ్ళ ముందు కనపడుతుంది. ఈమె మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికే అభిమానులలో ఈమె చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన సౌందర్య తెలుగులో అగ్ర హీరోలందరూ సరసన నటించి అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.ఇలా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి, ఎలాంటి ఎక్స్పోజింగ్ కి తావు లేకుండా తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య అంతే తొందరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈమెకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన గుర్తింపు కారణంగా రాజకీయాలలోకి వెళ్లారు. రాజకీయాలలో భాగంగా ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో ఈమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో సౌందర్య మృతి చెందారు. సౌందర్య మృతి ఇప్పటికీ తన తల్లిదండ్రులను దుఃఖసాగరంలోనే ఉంచింది. సౌందర్య నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలో తనకు బంధువులు అయినటువంటి వ్యక్తి రఘును వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా సౌందర్య ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదట. తల్లిదండ్రులను ఒప్పించి సౌందర్య తన బంధువుల అబ్బాయిని వివాహం చేసుకున్నారు.అయితే సౌందర్యం మరణం తర్వాత కొన్ని రోజులపాటు తన జ్ఞాపకాలతోనే బతికిన రఘు అనంతరం ఆమె మరణించిన తర్వాత ఆమె ఆస్తులు అన్నింటిని తన హక్కుగా భావించి ఆస్తులను తీసుకున్నారని ఇలా ఇండస్ట్రీలో సౌందర్య సంపాదించిన ఆస్తులు మొత్తం పోవడంతో సౌందర్య తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే సౌందర్య ఆరోజు తన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అలాగే రాజకీయాలలోకి వెళ్లకుండా ఉండి ఉంటే సౌందర్య నేడు మన మధ్యనే ఉండేది అంటూ అభిమానులు ఈమె విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.