స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని అంత మాట అనిందా… ఆ విషయంలో స్నేహకు వార్నింగ్ ఇచ్చిన బన్నీ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారి వారి వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ స్నేహమధ్య ఓ విషయం గురించి చిన్నపాటి మనస్పర్ధలు మొదలయ్యాయని దీంతో అల్లు అర్జున్ స్నేహకు చిన్నపాటి గొడవ కూడా జరిగిందని సమాచారం.అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సినిమాలలో లేకపోయినా హీరోయిన్లకు మంచి పాపులారిటీ ఉంది. ఈమె హీరోయిన్లతో సమానంగా స్టైలిష్ గా ఫోటో షూట్ చేయించుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.అయితే గత కొద్ది రోజుల క్రితం ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం సౌత్ ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో అల్లు అర్జున్ స్నేహమధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.

ఈమె ఎంతో స్టైలిష్ డిజైనర్ దుస్తులలో ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్స్ చేయించుకుంటారు. ఇలా ఈమె ఫోటోషూట్స్ కి కూడా చాలామంది అభిమానులుగా మారిపోయారు.అయితే ఫోటోషూట్స్ విషయంలో అల్లు అర్జున్ స్నేహకు కొన్ని లిమిట్స్ పెట్టిన ఆమె వాటిని క్రాస్ చేస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారట అదే విధంగా ఒకానొక సందర్భంలో ఈమె అల్లు అర్జున్ కు అసలు స్టైలిష్ స్టార్ అని ఎలా బిరుదు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాదని స్టైల్ విషయంలో ఆయనది జీరో నాలెడ్జ్ అంటూ ఈమె అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది.