ఓటిటిలో “ధనుష్” సినిమా ఎప్పుడు ఎందులో అంటే!

SIR-app-abde8450-0e76-11ed-9d94-e7720900bb85

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు హిందీ దర్శకులతో తమిళ సినిమా హీరోలు టాలీవుడ్ దర్శకులతో ఇలా ఆల్ మోస్ట్ ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకో సినిమా ఇండస్ట్రీ వారు కలిసి పని చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా చేసిన సినిమానే వాథి/ సార్. కాగా ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించారు.

మరి ధనుష్ కి ఈ సినిమానే డెబ్యూ కాగా తన మొదటి సినిమాతోనే ధనుష్ భారీ వసూళ్లు అందుకొని సినిమా మేకర్స్  అనుకున్న సక్సెస్ ని అయితే అందుకున్నారు. 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకుకున్న ఈ సినిమా ఇపుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఈ సినిమా మార్చ్ 17 నుంచి తెలుగు సహా తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. సో మొత్తానికి అయితే మంచి రన్ లో ఈ సినిమా ఇదే ఊపులో ఓటిటి లో కూడా అలరిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అయితే భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

సముద్రఖని విలన్ గా నటించిన ఈ సినిమాలో హైపర్ ఆది పలువురు తమిళ్ మరియు తెలుగు  నటించారు. అలాగే జివి ప్రకాష్ సంగీతం అందించాడు. కాగా త్రివిక్రమ్ మరియు సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మాణం వహించారు.