విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ గా మన ముందుకి వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు.ఈ సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కాకుండా ఆయన మరొక రెండు సినిమాలకి కమిట్ అయ్యారు.
అందులో ఒకటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా, అవును అతను మరెవరో కాదు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ ని అందించిన దర్శకుడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతున్న ఈ సినిమాలో నటుడు ఆర్నాల్డ్ ఓస్లు ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కథలో ఆ పాత్ర బలమైనది కావడంతో ఆర్నాల్డ్ తో నటింపజేయాలని అనుకున్నారంట డైరెక్టర్.
అయితే ఆర్నాల్డ్ ని రాహుల్ ఒప్పించగలడా అనేది చూడాలి.ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తెగ కష్టపడుతున్నాడంట. సినిమా సినిమాకి తన ఫిజిక్ ని డిఫరెంట్ గా చూపించే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మరింత ఫిట్ గా కనిపించడం కోసం తెగ వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డప్ చేసుకుంటున్నాడు. హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఆర్నాల్డ్ తో తలపడాలంటే ఆ మాత్రం బాడీ మెయింటైన్ చెయ్యాలి కదా.
అసలే మనోడు పాత్రకి ప్రాణం పెట్టేస్తాడు. అందుకే పగలు రాత్రి జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడంట. విజయ్ దేవరకొండ 14వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఒక భారీ పీరియాడికల్ వార్ డ్రామాగా ఉండబోతుందట. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల జనవరిలో ప్రారంభించి అదే సంవత్సరంలో విడుదల చేయడానికి ప్లాన్ వేస్తున్నారు మూవీ టీం. విజయ్ దేవరకొండకు టాక్సీవాలాతో మంచి హిట్ ఇచ్చిన రాహుల్ ఈ సినిమాతో మరో హిట్ ఇస్తాడో లేదో చూడాలి.