Devara: అధికారికంగా బ్లాక్‌ టిక్కెట్ల దందా.. కొత్త సినిమాల విడుదలలో నయా ట్రెండ్‌!

Devara: అగ్ర హీరోల సినిమాలు విడుదల సందర్బంగా టిక్కెట్ల రేట్లు పెంచి రెండు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేలా సినిమా నిర్మాతలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి రేట్లు పెంచుకునేందుకు సహకరిస్తున్నాయి. దీంతో టిక్కెట్లు అమాంతంగా పెరుగు తున్నాయి. అంతేమేరకు బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముతున్నారు.

ఇకపోతే మిడ్‌నైట్‌ ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోలు వేయడం ద్వారా మరింత గుంజేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను అందరికన్నా ముందుగా చూడాలని ఫ్యాన్స్‌ చూపించే ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని బెనిఫిట్‌ షో నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు.

Devara: నార్త్‌ అమెరికాలో ‘దేవర’ ప్రీసేల్స్‌ అదుర్స్‌!

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎగబడుతున్నారు. ఫ్యాన్స్‌ క్రేజ్‌ను బట్టి మెయిన్‌ సిటీల్లో అభిమానుల కోసం బెనిఫిట్‌ షోలు ఏర్పాటు చేయడం అనవాయితీ.

ఇప్పుడు అగ్ర తారలు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు ప్రభుత్వం కూడా అదనపు షోలు, టికెట్‌ రేట్‌ పెంచడం లాంటి వెసులుబాటు కల్పిస్తోంది. గురువారం అర్ధరాత్రి దేవర బెనిఫిట్‌ షోలను ఏర్పాటు చేశారు మేకర్స్‌. మిడ్‌ నైట్‌ షో ఒంటి గంటకు ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్‌లో మొత్తంవిూద 20కి పైగా ధియేటర్స్‌లో మిడ్‌ నైట్‌ షోలు ప్లాన్‌ చేశారు. అయితే వీటిని ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ పెట్టకుండానే డైరెక్ట్‌గా టికెట్లను అమ్ముతున్నారు. దీని వెనుక చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యకులతోపాటు కొందరు పీఆర్‌ఓలు ఉన్నారు.

Devara: ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి: ఎపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

క్రేజీ సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారీ మూవీ టికెట్‌ మాఫియా ముఠాలు. ‘దేవర‘ సినిమా బెనిఫిట్‌ షో చూడాలంటే అక్షరాల రెండువేలు చెల్లించాల్సిందే! మామూలుగా మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో సినిమా టికెట్‌ ధర హై క్లాస్‌ అయితే రూ.500 ఉంటుంది.

కానీ బెనిఫిట్‌ షో ధర ఆకాశాన్ని అందుకున్నట్లు రూ.2000 పలుకుతోంది. ఏఎంబీలో ఒక్కో స్క్రీన్‌ సీటింగ్‌ కెపాసిటీ 300 వరకూ ఉంటుంది. అంటే ఒక్క షో కి వసూలు చేసే మొత్తం ఆరు లక్షల రూపాయలు. బెనిఫిట్‌ షోకి ప్రత్యేకంగా కట్టాల్సిన టాక్స్‌ ఏవిూ ఉండదు. షో నిర్వాహకులు హోల్‌ థియేటర్‌ బుక్‌ చేసుకుంటారు. అది కూడా టాక్స్‌తో కలిపే. ఇందులో ఖర్చులు పోగా దాదాపు సగానికి సగం తమ జేబులో వేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు ఇదొక దందాగా మారింది. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కన్నేయాల్సి ఉంది. టిక్కెట్ల రేట్లు పెంచకుండా చూడాలి. హీరోలు కోట్లకుకోట్లు తీసుకుంటూ ప్రేక్షకులను గుల్ల చేస్తున్నారు.

Director Geetha Krishna About Devara & Pushpa 2 Movie | Junior NTR | Allu Arjun | Telugu Rajyam